Useful Links

January 21, 2013

కూచిపూడి చరిత్ర

మన తెలుగు వారందరికి తెలియజేయండి ..!! తెలుగు కళలను కాపాడదాం ..!!
Kuchipudi Dance
కూచిపూడి నృత్యము, భారతీయ నృత్యరీతులలో ప్రధానమైనది.ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన కూచిపూడి గ్రామములో ఆవిర్భవించినది.

కూచిపూడి గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది. ఇది ప్రాచీన ఆంధ్ర చరిత్రాత్మక నగరమైన (క్రీ పూ 2వ శతాబ్దం )శ్రీకాకుళంకు ఆరు మైళ్ళ దూరంలో ఉన్నది. శాతవాహనులు ఈ కళకు గొప్ప ఆరాధకులుగా ప్రసిద్ధి గాంచారు. అప్పట్లో అత్యంత పవిత్ర దేవాలయమైన ఆంధ్ర విష్ణు దేవాలయం ఆవరణలో లభ్యమైన శాసనాల ప్రకారం దాదాపుగా మూడు వందల మంది దేవదాసీలు రాజమర్యాదలు అందుకునేవారు. ఇక్కడ లభ్యమైన శిల్పాలు కూడా ఆ నృత్య కళాకారిణుల దైవపూజగా భావించే అపురూప భంగిమలను దాచిపెట్టినట్లు కనిపిస్తాయి. చాలాకాలం వరకు ,కూచిపూడి నృత్యం దేవాలయాల్లో ప్రదర్శింపబడేది. సాంప్రదాయం ప్రకారం, పూర్వం బ్రాహ్మణ కులానికి చెందిన మగవారే కూచిపూడి నృత్యాన్నిచేసేవారు. అందుకే వీరిని కూచిపూడి భాగవతులు అంటారు. 15 వ శతాబ్దంలో సిద్దేంద్ర యోగి, కూచిపూడి నాట్యంలో ఆడవారు నాట్యం చేయడానికి అనుగుణంగా, కొన్ని మార్పులు చేసి దానిని పరిపుష్టం గావించాడు. వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, చింతా కృష్ణమూర్తి, తాడేపల్లి పేరయ్య వంటి కూచిపూడి నృత్య కళాకారులు దీనిని విస్తరించి, సంస్కరించారు. కూచిపూడి నృత్యప్రదర్శన గణేష స్తుతి, సరస్వతీ స్తుతి, లక్ష్మీస్తుతి, పరాశక్తి స్తోత్రాలతో మొదలవుతుంది. ఇది భరతుని 'నాట్య శాస్త్రాన్ని' ఉల్లంఘించదు. చురుగ్గా లయబద్ధంగా కదిలే పాదాలు, శిల్పసదృశమైన దేహభంగిమలు, హస్తాలు, కళ్ళతో చేసే కదలికలు, ముఖంలో చూపించే భావాలు, మూకాభినయంతో కూచిపూడి నృత్య కళాకారులు సాత్వికాభినయం, భావాభినయం చేయడంలో ఉద్ధండులు. కృష్ణుని భార్య, సత్యభామ ను అనుకరిస్తూ చేసే నాట్యం భామాకలాపం. ఒక ఇత్తడి పళ్ళెంపై పాదాల నుంచి, నాట్యం చేయడాన్నితరంగం అంటారు. ప్రక్కన ఒక గాయకుడు, కర్ణాటక సంగీతశైలిలో కీర్తనలను పాడతాడు. దీనినే నట్టువాంగం అంటారు. ఇందులో మృదంగం, వయొలిన్, వేణువు వంటి వాద్యపరికరాలను ఉపయోగిస్తారు.


Source:
Telugu Official Facebook Page

No comments:

Post a Comment

Thank you,
- Hinduadhyathmikam.