ముందుగా మతమంటే ఏమిటి అనేది నిర్ధారించుకుందాము. మతమంటే ఒక మార్గము, ఒక అభిప్రాయము ,లేదా ఒక సిద్దాంతము కూడా కావచ్చు .కొద్దిమంది లేక పెద్దసమూహం యొక్క నమ్మకం కావచ్చు .అది సత్యమైనా కావచ్చు కాకపోవచ్చు. ఒక్కోసారి మనం అంటుంటాము వాడిమతం వేరురా వాడు ఎవరు చెప్పినా వినడు అని . కాబట్టి ఈరీతి లోచూస్తే మన పుణ్యభూమి యగు భరతఖండములో వున్నది మతమా ? కాదు అనిచెప్పవచ్చు .ఎంతోమంది మహాత్ములు చూపిన బాటలు ఎన్నోవున్నాయి .ద్వైతం ,అద్వైతం ఇలా చాలా . అవి సత్యాన్వేషకులైన మహాత్ములు మానవాళికి చూపిన బాటలు .ఆయామార్గాలను ఆచరించే కోట్లాదిమంది మాత్రం వీటన్నిటినీ ఒకేదృష్టితో చూస్తున్నారు. అంటే ఇక్కడ ఈమతప్రవక్తలు లేక సిద్దాంతకరతలు చెప్పినది ఏదో అదిమాత్రం ఒక్కటే .అది సత్యము సత్యము సత్యము.
దానినే ధర్మం అంటాము. మతాలు మారినా ధర్మం మాత్రం మారదు. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అనేది ప్రకృతి ధర్మం .అది ఎంతమంది ఎన్నిరకాలుగా ఎన్నిభాషలలో చెప్పినా మార్పులేని ఒకేధర్మం . కాబట్టి మనం వారసత్వంగా పొందుతూ వస్తున్నది మతం కాదు .ధర్మాన్ని . కనుక మనది హిందూమతం కాదు ,హిందూధర్మం . కనుకనే ఇది ధర్మ భూమి అయినది. ప
రమాత్మ వాదనలకు అందని నిత్యసత్యధర్మం . దానిని మనం తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా ఆయన సత్యం . కనుక ఆసత్యాన్ని నమ్మిన మహర్షులు ,జగద్గురువులు ఈపుణ్యభూమిపైనే అవతరించి మానవాళికి సత్యమైన మార్గాన్ని ధర్మయుక్తమైన జీవితమార్గాన్ని పలురకాలుగా బోధించి శాసించి నిర్దేశించారు .ఇది మానవాళి సంపూర్ణవికాశానికి ,మానవ శరీరం లోవున్న ఆత్మ ,అవ్యక్తంగావుండే ఆ పరమాత్మను చేరుకుని పరిపూర్ణత పొందటానికి .
కనుక మనది హిందూధర్మము . ఇందులో మానవుడు తల్లి గర్భం లో పడ్డప్పటినుండి పెరిగేదశలలోనూ ఉడిగేదశలలోనూ చివరకు కాటికి ఒరిగేదశలోనూ .ప్రతి దశలోనూ ధర్మానికనుగుణంగా ను దైవం పట్ల విశ్వాసం తో మమేకమై జీవన యానం సాగిస్తాడు. చిన్నప్పడు తల్లికడుపున పడటానికి కారణమైన సన్నివేశాన్నుంచి సీమంతము .జాతకర్మ .నామకరణం ,అక్షరాభ్యాసం ,ఒడుగు చేయటం ,వివాహం ,షష్టిపూర్తి ,మరణసమయాన తులసితీర్థసేవనం ,దశదినకర్మకాండలనుండి పిండప్రదానాలదాకా ప్రతిదశ అథ్యాత్మిక మేళవింపుతో .ప్రకృతి ధర్మాలకు,దైవన్యాయానికి అనుగుణంగా పుట్టి ,జీవించి మరణించటం మన ప్రత్యేకత .ఇతరులలాగా మనకు దేవుడు ,వేరు జీవితం వేరుకాదు ,దైవంతోనే జీవితం .ధర్మం తోనే జీవనయానం సాగుతుంది. కనుక మనది హిందూమతం కాదు ,హిందూధర్మం.
- Hinduism...
No comments:
Post a Comment
Thank you,
- Hinduadhyathmikam.