నైజీరియా లో ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకసారి జ్ఞానం, ఆహారం, సంపద కలసి ప్రయానమయ్యాయట. దారిలో వారికొక మనిషి ఎదురయ్యాడు. ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. తమకో నివాసం కోసం వెతుక్కుంటూ బయలుదేరామని బదులిచ్చాయి. "అలాగా! సంపదా! నువ్వైతే మా ఇంట ఉండొచ్చు గా" అన్నాడట ఆ మనిషి. "నీలాంటి మూర్ఖుడి ఇంట నేనెంతో కాలం ఉండలేను" అంది సంపద.
వారు మరి కొంత దూరం వెళ్ళాక మరో మనిషి తారసిల్లాడు. మొదటివాడి లాగే అడిగాడు. అవీ అదే జవాబు చెప్పాయి. 'అయితే, ఆహారమా! నువ్వు నా ఇంట ఉండవచ్చు' అన్నాడతను. 'నువ్వీవేల ఉండమన్నా... నన్నెంతో కలం భద్రంగా ఉంచుకోవటం నీకు చేతకాదు' అంది ఆహరం. మరి కొంత దూరం వెళ్ళాక మూడో మనిషి కనిపించాడు. అదే ప్రశ్న వేసి అదే జవాబు విన్నాడు. 'ఎంత అదృష్టం నాది... జ్ఞానమా, నువ్వు ఎల్లకాలం నా ఇంటనే ఉండిపో అన్నాడు..' అంతే! 'నువ్వు వివేకవంతుడివి, జ్ఞానం తో పాటు మేము కూడా నీతోపాటే నిశ్చింతగా ఉండిపోగలుగుతాం' అన్నాయి ఆహరం, సంపద ముక్త కంఠంతో. జ్ఞానం ఉన్నచోట దేనికి లోటు ఉండదని చెప్పటమే ఈ కథ లోని నీతి.
వివేక హీనులైన మనుషుల మధ్యనే కలహాలు, ఈసునసూయలు, దుఃఖాలు, బాధలు, కలతలతో రగిలిపోయేవారు ఇతరుల సుఖాలని చూసి భరించలేరు. తమలాగే వాళ్ళు కూడా బాధపడటం చూస్తేనే వీళ్ళ కళ్ళు చల్లబడుతాయి. అది చూసి కడుపు నిండినట్టు ఉంటారు. ఇరుగూ పొరుగూ కలిసి సుఖపడగలిగినప్పుడే సామాజిక భద్రత ఉంటుందన్న ఆలోచన కేవలం వివేకవంతులకు మాత్రమే కల్గుతుంది.అలాంటి వారు తమ కష్టాల్ని లెక్క చేయరు. అందరి సుఖ శాంతుల కోసం ఎం చేయాలో వారికెవరూ చెప్పనవసరం లేదు. స్వశక్తితో వారు మనస్పూర్తిగా చేసి చూపిస్తారు. కన్ఫూషియస్ అనే తాత్వికుడు జ్ఞానాన్ని మూడు విధాలుగా సంపాదించవచ్చు అన్నాడు. మొదటి పద్ధతి "అనుకరణ", అంటే ఇతర జ్ఞానులను అనుసరించి ప్రవర్తించటం. ఇది సులువైన పద్ధతి. రెండోది 'చింతన', మంచి చెడుల విచక్షణ కలిగి వేదాంత తత్వాన్ని గ్రహించే పద్ధతి. మూడవది 'అనుభవం' అన్నింటికన్నా కష్టమైనది, చేదైనది. అయినా స్వానుభవంతో నేర్చుకునే పద్ధతి. ప్లాటో సిద్ధాంతం ప్రకారం, సోక్రటీసు పరమ జ్ఞాని. ఆ మాట విన్నప్పుడు సోక్రటీసు చాల ఆశ్చర్యపోయాడట. తనకంటే అత్యుత్తమమైన జ్ఞానులేందరో ఉండగా తననంత ఉన్నత స్థానంలో ఉంచటం సముచితం కాదన్నాడట. కాని, ప్లాటో అనేకమంది రాజనీతజ్ఞులను, కవులను, కళాకారులను వారివారి శాస్త్రాల మీద అనేకవిధాలుగా ప్రశ్నించాడట. ఆ విషయాల్లో పరిపూర్ణులమని చెప్పుకునేవారికి కనీసం ప్రాథమిక జ్ఞానమైన లేదని నిరూపించాగాలిగాడు. తమ తమ శాస్త్రాల్లో నిష్ణాతులమని చెప్పుకునే వారిలా కాకుండా ఎన్నో తెలిసినా తనకేమి తెలియదని, తానింకా తెల్సుకోవలసింది చాల ఉందని చెప్పినవాడు సోక్రటీసు ఒక్కడే. అందుకనే ఆయన సర్వోత్కృష్టమైన జ్ఞాని అని ప్లాటో సిద్దాంతీకరించాడు. మంచీ చెడూ, న్యాయ, అన్యాయాలు, ధర్మాధర్మాలు, నిజానిజాల గురించి తనకి తెలిసినంతగా ఎవరికీ తెలియక పోవటమే అతనిని పరమజ్ఞానిని చేసింది.
source: అంతర్యామి
బెల్లాల.
source: అంతర్యామి
బెల్లాల.
No comments:
Post a Comment
Thank you,
- Hinduadhyathmikam.